Header Banner

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీతో పాటు మరో నలుగురు సైకోలని కూడా..

  Thu Feb 13, 2025 12:57        Politics

వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల వాహన శ్రేణి నందిగామ వరకు వచ్చింది. మరో అరగంటలో వీరు విజయవాడకు చేరుకుంటారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో గన్నవరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు, వంశీ అరెస్ట్ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంశీ మనిషి కాదని, ఆయన ఒక మృగమని అన్నారు. వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే చంపేసేవారని... ఇక్కడ కాబట్టి బతికిపోయాడని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి వంశీ అని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా వంశీ డ్రామాలు ఆడాడని... డ్రెస్ మార్చుకుంటానని లోపలకు వెళ్లి ఫోన్లు చేసి, అల్లర్లకు పాల్పడాలని అనుచరులకు చెప్పాడని సోమిరెడ్డి మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని, కార్లు తగులబెట్టారని, మనుషులను చంపేందుకు కూడా యత్నించారని అన్నారు. కేసు పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్ ని భయపెట్టాడని చెప్పారు. వంశీ బతుకు ఇప్పుడు బయటపడిందని అన్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని అన్నారు. వంశీతో పాటు మరో నలుగు మృగాలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

 

నేడు (13/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SomireddyChandraMohanReddy #Telugudesam #VallabhaneniVamsi #YSRCP