Header Banner

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

  Sat Apr 12, 2025 14:56        Politics

విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి - 65ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎఐ) కార్యాచరణ ఆరంభించింది. జాతీయ రహదారులను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకూ విస్తరిస్తారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కి. మీ. మేర ఉంది. ఇందులో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కంకిపాడు - ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం సమీపంలో క్రాస్ అవుతుంది. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 44 కి. మీ. మేర ప్రస్తుతమున్న నాలుగు వరుసల మార్గాన్ని.. ఆరు వరుసలుగా విస్తరిస్తారు. మచిలీపట్నం వద్ద ఒంగోలు - కత్తిపూడి జాతీయ రహదారి రెండు వరుసలుతో ఉంది.

 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

ఇందులో మాచవరం రైస్ మిల్లు వరకు 4 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. మాచవరం రైస్ మిల్లు వద్ద నుంచి పోర్టుకు 3.7 కి.మీ.లను నాలుగు వరుసలతో కొత్తగా రహదారిని నిర్మిస్తారు. వీటిలో ఆరు వరుసలుగా విస్తరించనున్న 44 కి. మీలతోపాటు 3.7 కి.మీ. మేర నాలుగు వరుసల హైవే నిర్మాణాన్ని ఎన్హెచ్ఎఐ చేపడుతుంది. ఒంగోలు - కత్తిపూడి హైవేలో 4 కి.మీ మేర విస్తరించే పనులను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) పర్యవేక్షిస్తుంది. మొత్తంగా ఈ రహదారికి చెందిన డీపీఆర్ తయారీ బాధ్యత చైతన్య, ఎంఎస్ పార్క్ జేవీ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

యూకే లో మృతిచెందిన గుంటూరు విద్యార్ధి! తీరని విషాదంలో కుటుంబ సభ్యులు! ఆదుకోమని ఎన్నారైలకు అభ్యర్ధన!

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్! 

 

కేంద్రం నుంచి శుభవార్త! ఏపీలోని ఆ ఐదు ప్రాంతాలకు పండగలాంటి వార్త! ఇకపై గాలిలో విహరించవచ్చు!

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

         

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations