Header Banner

అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!

  Mon Feb 10, 2025 13:38        Politics

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వీఆర్‌వో చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. అసలు వీడు మనిషేనా అని అభిప్రాయడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి.. ఒక మహిళతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని ఆ వ్యక్తిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఈ వీఆర్‌వో ఏం చేశాడు? మహిళా ఏ చేసింది? అనే అంశాలను మనం ఒకసారి తెలుసుకుందాం.. తాడిపత్రిలో ఉంటున్న ఒక మహిళ తన కూతురి కోసం కొత్త రేషన్ కార్డు కాళ్లు అరిగేలా తిరిగారు. కూతురి భర్త రెండేళ్ల కిందట మరణించారు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల కూతురికి ఒంటరి మహిళ పెన్షన్ డబ్బులు రావడం లేదు. ఈ క్రమంలో కూతురికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని సదురు మహళ వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఆ ఇళ్లన్నీ వారికే! ఈ పని త్వరగా చేయాలి.. మంత్రి కీలక అప్డేట్!

 

అంతేకాకుండా తాడిపత్రి మున్సిపల్ అధికారులను కూడా కలిసి, సమస్య తెలిపింది. అయినా ఫలితం మాత్రం లేదు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే చంద్రశేఖర్ ఇదే అదును అనుకొని నీ కూతురిని నా దగ్గరకు పంపించు.. అప్పుడు రేషన్ కార్డు ఇప్పిస్తా అని అన్నాడని.. సదురు మహిళా బాధపడుతూ విషయాన్ని వీడియో రూపంలో తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో అనంతపురం ఆర్డీవో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రి ఎంఆర్‌వో సదురు మహిళ నుంచి వివరాలు తీసుకొని నివేదికను అందించారు. ప్రజల కోసం పని చేయాల్సిన ఉద్యోగి.. ఇలా లైంగిక వేధింపుకులకు పాల్పడటం సర్వత్రా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇలాంటోళ్లను ఉద్యోగం నుంచి తీసేయాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం! నలుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!

 

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #GovernmentEmployee #ViralVideo #ShockingIndicident #Tadipatri