Header Banner

ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు!

  Sun Feb 09, 2025 14:54        Politics

గ్రామానికి చెందిన భూమిని ఆక్రమంగా ఆన్‌లైన్ చేయించుకొని ఆపై ఊరిని తాకట్టు పెట్టిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం గ్రామ రెవెన్యూలోని సర్వే నెం. 296లో 836 ఎకరాల భూమి ఉంది. అదే సర్వే నంబరులో సిద్దెనపాలెం గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గడ్డం సుబ్బయ్య ఈ భూమిలో 4.32 ఎకరాలు, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొల్లి వీరబ్రహ్మయ్య 4.00 ఎకరాల భూమిని ఆక్రమంగా 2020లో ఆన్లైన్ చేయించుకున్నారు. గడ్డం సుబ్బయ్య వెంటనే ముటుకుల సొసైటీకి ఆ భూమిని తాకట్టు పెట్టారు. 2020లో రూ. 3లక్షల రుణం పొందాడు. దీనిపై శుక్రవారం గ్రామానికి చెందిన మాగులూరి లక్ష్మమ్మతోపాటు మరికొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ పరిపాలనకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! మంత్రులు, కార్యదర్శులతో కీలక భేటీ!

 

దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకుడు గడ్డం సుబ్బయ్య.. మాగులూరి లక్ష్మమ్మను బెదిరించి, దుర్భాషలాడారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎల్. సంపత్‌కుమార్ కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు సుబ్బయ్యను అరెస్టు చేసి మార్కాపురం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే 2020లో 'ఆంధ్రజ్యోతిలో 'ఊరినే ఆన్లైన్.. ఆపై తాకట్టు' శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి విదితమే. అయితే అప్పటి మంత్రి రాజకీయ ఒత్తిడితో ఆ భూమిపై విచారణ చేయకుండా వదిలేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సదరు కబ్జా నాయకుడిపై చర్యలు చేపట్టారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!

 

జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..

 

ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #YCP #AndhraPradesh #APpolitics #APNews #EC