Header Banner

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

  Mon Apr 14, 2025 10:13        Politics

విశాఖపట్నంలోని వంశీరెడ్డిపై గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయన తన తండ్రి, అప్పటి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలు చేసారని చెబుతున్నారు. వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములపై ఆక్రమణలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దయాల్‌నగర్ కొండపై ఇళ్లు నిర్మించుకున్న వారి వద్ద డబ్బులు డిమాండ్ చేశారని, వారు డబ్బులు ఇవ్వకపోతే జీవీఎంసీ మరియు రెవెన్యూ అధికారుల సహాయంతో వారి నిర్మాణాలను కూల్చించారని వాదనలు వినిపిస్తున్నాయి.

 

ఇక పెదగంట్యాడలో ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసిన కొంతమంది, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, అయితే వారి నుండి వంశీరెడ్డి బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అదే ప్రాంతంలో వంశీరెడ్డి అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఒక కళ్యాణ మండపం నిర్మిస్తుంటే, అధికారులను ఆ దిశగా వెళ్లకుండా ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. తరువాత అధికారులు మండపాన్ని తొలగించారు. అదే సర్వే నంబర్‌లో వంశీరెడ్డి కొంతభూమిలో షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అధికారులు వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటుండగా, వంశీరెడ్డి వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పి, జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #VamsiReddy #PoliticalControversy #LandGrabbing #AndhraPolitics #GVMCIssues