Header Banner

వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!

  Wed Feb 26, 2025 12:48        Politics

ఏపీలో అధికారం కోల్పోయినప్పటికీ వైఎస్సార్పీ నేతల ఆగడాలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు యెదేచ్ఛగా మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా భీమవరం వైసీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజుపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. రామరాజు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు శివరంజని అనే మహిళ ఆరోపించింది. భీమవరం మున్సిపాలిటీలో మెప్మాలో టీఎల్ఎఫ్ ట్రెజరర్‌గా శివరంజని పనిచేస్తోంది. రామరాజు తరచూ తనకు ఫోన్‌లు చేస్తూ హింసించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రామరాజు వేధింపులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని మహిళ చెబుతోంది. పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. రామరాజు మాట్లాడిన ఆడియో కాల్స్‌ను శివరంజని బయటపెట్టింది.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆవేదన ‘‘భీమవరం పట్టణ అధ్యక్షుడిగా రామరాజు ఎన్నికైన సమయంలో శుభాకాంక్షలు తెలిపిందేకు సీహెచ్‌ కృపామణి తనను తీసుకెళ్లారు. ఆ తరువాత రామరాజు తనకు రోజూ ఫోన్‌ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామా, కార్ తీసుకురానా అంటూ కాల్స్ చేసేవాడు. అలా రెండు మూడు సార్లు లైంగింకంగా వేధించాడు. ఫిబ్రవరి 14న కృపామణి నన్ను తీసుకెళ్లి రామరాజుతో మాట్లాడాలని చెప్పారు. హ్యాపీ వాలంటైన్స్‌ డే అని చెప్పి కారులో నన్ను లాక్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ రోజు తప్పించుకుని పారిపోయాను.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


రామరాజుతో లైంగిక దాడి చేసేలా ప్రోత్సహించింది కృపామణి. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాను. వెంటనే రామరాజు నాకు ఫోన్‌ చేసి బెదిరించాడు. కేసు వెనక్కి తీసుకోవాలని కృపామణితో పాటు రామరాజు బెదిరించారు’’ అని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. వైసీపీ నేత వేధింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీప వైసీపీ నేతల దుశ్చర్యలు ఆగకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రామరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలకి న్యాయం చేయాలని కోరుతున్నాయి.

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!



ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycp #leader #casefile #todaynews #flashnews #latestnews