Header Banner

గ్రూప్ 1లో అక్రమాలు..! పీఎస్ఆర్‌పై మరో కేసు నమోదు!

  Tue Apr 29, 2025 10:13        Politics

వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ -1 (Group-1)లో పీఎస్సార్ ఆంజనేయులు (PSR Anjaneyulu) చేసిన అక్రమాలపై కేసు (Case) నమోదు అయింది. మోసం, నిధులు దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్లు కింద కేసు నమోదు అయింది. కేసు విచారణ బాధ్యతను సీనియర్ పోలీస్ అధికారికి ఉన్నతాధికారులు అప్పగించారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్‌లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన అనంతరం కేసు విచారణను ఏసీబీకు అప్పగించే అవకాశం ఉంది.

మంగళవారంతో ముగియనున్న పీఎస్సార్ కస్టడీ..
కాగా ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో మంగళవారం కూడా పీఎస్సార్‌ను సీఐడీ అధికారులు విచారించనున్నారు. కానూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సీఎస్సార్‌ను ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి ఆధ్వర్యంలో రెండు బృందాలు పీఎస్సార్‌ను ప్రశ్నించాయి. మొత్తం 82 ప్రశ్నలు అడిగితే వాటికి దాటవేత ధోరణిలోనే సమాధానాలు చెప్పారు. జెత్వానీపై కేసు నమోదు చేయలని ఎవరు ఆదేశించారని అడిగితే అసలు ఆమె ఎవరో తనకు తెలియదని ఆయన బదులిచ్చారు. కుక్కల విద్యాసాగర్ ఎవరి ద్వారా కలిశారని అడిగినా తనకు తెలియదని చెప్పారు. జెత్వానీపై కేసు నమోదు చేయడానికి ముందు జగన్ నివాసానికి వెళ్లారా కదా అని ప్రశ్నిస్తే వెళ్తే వెళ్లి ఉండొచ్చు అంటూ దాటవేశారు. కాగా కోర్టు ఇచ్చిన మూడు రోజుల గడువు మంగళవారంతో ముగియనుంది. చివరి రోజు సీఐడీ మరో 80 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం పీఎస్సార్‌ను జైలుకు తరలించనున్నారు.


ఇది కూడా చదవండి: రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు కోర్టు షాక్! రిమాండ్ గడువు పెంపు.. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ!


పోలీసు భోజనం వద్దు..
సోమవారం విచారణకు హాజరైన పీఎస్ఆర్‌.. పోలీసులు అందించిన భోజనం తినడానికి ఇష్టపడలేదు. ఉదయం సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అల్పాహారం తీసుకోవాలని వారు కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. భోజన విరామ సమయంలో భోజనం చేయాలని సూచించగా.. ‘మీ పోలీసు భోజనం నాకొద్దు’ అని చెప్పారు. సీనియర్‌ పోలీసు అధికారిగా ఉన్న పీఎస్ఆర్‌.. తనకు, పోలీసు శాఖకు మధ్య గీత గీశారని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆయన కాఫీ మాత్రమే తాగినట్లు తెలిసింది.

ఇంటి భోజనం అనుమతించాలంటూ పిటిషన్..
తనకు ఇంటి నుంచి భోజనం, మందులు, తాగునీరు అనుమతించాలని ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు విజయవాడలోని మూడో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. జైలులో నిద్రపోవడానికి సౌకర్యంగా ఉండే పడకను ఏర్పాటు చేయాలని ఆయన తరఫున న్యాయవాది విష్ణువర్ధన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi psr #casefiled #jailed #group1 #scam #arrest