Header Banner

ఏపీ డీఎస్సీ! టెట్ వెయిటేజీతో కొత్త రూల్స్..! అభ్యర్థులకు కీలక సూచనలు!

  Mon Apr 28, 2025 16:05        Education

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈ నెల 20వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ పోస్టులు ఉండటంతో పోటీ తీవ్రత కూడా అదే స్థాయిలో ఉండనుంది. మొత్తం ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులుండగా.. రాష్ట్ర, జోనల్‌ స్థాయుల్లో 2259 వరకు కొలువులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో ఎస్‌జీటీ ఉద్యోగాలు 6599 ఉంటే, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 7487 ఉన్నాయి. ఇవికాకుండా వ్యాయామ టీచర్‌, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి.

అన్ని పోస్టులకు అంటే టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులకు టెట్‌లో అర్హత తప్పనిసరి. ఈ పోస్టులకు టెట్‌లో వెయిటేజి 20 శాతం ఉంటుంది. కానీ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు మాత్రం టెట్ అవసరం లేదు. ఈ మూడు రకాల పోస్టులకు పేపర్‌ 1 గా ఇంగ్లిష్‌ స్కిల్‌ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌ 2 మార్కులు లెక్కిస్తారన్నమాట. బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు అనర్హులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2678 పోస్టులున్నాయి. 543 పోస్టులతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంటే డీఎస్సీ 80 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర (1/2)మార్కు కేటాయిస్తారు. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకూ జరుగుతాయి.


ఇది కూడా చదవండిశుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APDSC #DSCNotification #TETWeightage #TeacherJobs #EducationNews #GovtJobs #APJobs