Header Banner

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

  Mon Mar 31, 2025 12:19        Politics

ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కీలక నిర్ణయాలు అమలుకు సిద్దం అయింది. రేపు సమూల ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. రేపటి (ఏప్రిల్ 1) నుంచే 2025-26 విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు. అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏప్రి ల్ 7 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించా లని నిర్ణయించారు. టైమ్ టేబుల్ లో మార్పులు చేసారు. సబ్జెక్టుల్లోనూ కొత్త విధానం అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ విద్యలో కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. ఇంటర్ సంస్కరణలు రేపు ( ఏప్రిల్‌ 1) నుంచే అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు ఏప్రిల్‌ 7 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వ హించనున్నారు. వేసవి సెలవుల తరువాత జూన్‌ 1న విద్యా సంవత్సరం పునః ప్రారంభం అవు తుంది. కాగా, ప్రైవేటు కాలేజీల తరహాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు కూడా అడ్మిషన్లకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నాయి. జూనియర్‌ కాలేజీల పనివేళలను కూడా ఇంటర్‌ బోర్డు మార్చింది. ప్రస్తుతం రోజుకు ఏడు పీరియడ్లు ఉండగా, ఇకపై ఎనిమిది పీరియడ్లు ఉండేలా టైమ్‌ టేబుల్‌ విడుదల చేసింది. కొత్త టైమ్ టేబుల్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలు పని స్తాయి.

 

ఇది కూడా చదవండి: వొడాఫోన్‌ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా కేంద్రం.. మంత్రిత్వ శాఖ ఫైలింగ్‌లో..

 

సబ్జెక్టులు, కోర్సుల్లో ఇంటర్‌ బోర్డు కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఎంపీసీ విద్యార్థులకు గణితం ఏ, బీలుగా ఉండగా.. దాన్ని ఒక్కటిగా చేసింది. బైపీసీలో బోటనీ, జువాలజీని బయాలజీగా మార్చింది. సైన్స్‌ విద్యార్థులకు ఆరు సబ్జెక్టుల స్థానంలో ఐదు సబ్జెక్టులు ప్రవేశపెట్టింది. వారికి ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా నిర్ణయించింది. ఇక, మూడు సంబంధిత గ్రూపు కోర్‌ సబ్జెక్టులుగా ఉండగా, మరొకటి ఎలక్టివ్‌ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. అదనపు సబ్జెక్టు కాకుండా మిగిలిన ఐదు సబ్జెక్టులు కచ్చితంగా పాస్‌ కావాలి. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకుంటే ఎంబైపీసీ అవుతుంది. అదనపు సబ్జెక్టు మార్కులను సర్టిఫికెట్‌ లాంగ్‌ మెమోలో చూపించరు. ఇందు కోసం అదనపు మె ఇస్తారు. దాని ఆధారంగా ఇంజనీరింగ్‌ లేదా వైద్యవిద్య వైపు వెళ్ళొచ్చు. సీబీఎస్ఈ తరహాలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశ పెడుతున్నారు. మొత్తం మార్కుల్లో 10 శాతానికి ఒక మార్కు రూపంలో ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫిబ్రవరి లోనే పబ్లిక్ పరీక్షలు ముగించేలా నిర్ణయించారు. ఇక, కాలేజీ పని దినాల్లోనూ మార్పులు చేసారు. కాలేజీ ల వర్కింగ్ డేస్ ను 222 నుంచి 235కు పెంచింది. 2025-26 నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్‌ అమలు చేస్తారు. దీంతో, పదో తరగతి పరీక్షలు రాసి.. ఇంటర్ లో చేరే విద్యార్ధ లు కొత్త మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting