Header Banner

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

  Tue Apr 08, 2025 11:56        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్‌(RTGS)పై సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్ నుంచి, అలాగే మద్రాసు ఐఐటీ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులను సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు.

 

ఇది కూడా చదవండి: పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్‌లైన్, డిజిటల్(Digital), వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp Governance) తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోను ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకుని ప్రజలు సేవలు పొందేలా అవగాహన కల్పించడంతో పాటు వాట్సప్ గవర్నెన్స్‌ను మరింత విస్తృత పరిచేలా చూడాలని ఆదేశించారు. జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవ‌ల‌న్నిటినీ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్‌(RTGS)లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మొత్తం 500 సేవలు వరకు వాట్సప్ ద్వారా అందించేందుకు వీలుందని, అయితే ప్రస్తుతం 254 సేవలు వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువచ్చామని.. వెయ్యికి పైగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటీ, ఆర్టీజీఎస్(RTGS) శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు.  

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations