Header Banner

పాకిస్తాన్‌లోని ఆంధ్రులు స్వదేశానికి రావాలి.. మరో 90 వేలు మందికి కూడా..

  Fri Apr 25, 2025 15:07        Politics

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎవరైనా పాకిస్తాన్‌లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి అడ్డంకులు ఉన్నట్లయితే ఎన్నారై విభాగం ద్వారా పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాకిస్తాన్‌లో ఉన్న ఆంధ్రులు స్వదేశానికి తిరిగి వస్తే వారి నైపుణ్యతను అనుసరించి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ నుంచి స్పాంజ్ పెన్షన్లు ఇస్తున్నామని.. భర్త చనిపోయిన మొదటి నెలలోనే పెన్షన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 30 వేలమంది వితంతువులకు పెన్షన్ కొత్తగా ఇవ్వడం జరిగిందని అన్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడలో.. 'ఉగ్ర' కదలికలు.. నలుగురు కాదు 10 మంది.! ఆ ప్రాంతాలలో జాగ్రత్త చర్యలు!

 

పెండింగ్‌లో ఉన్న మరో 90 వేలు మందికి కూడా వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.35 కోట్లు అదనపు భారం పడనుందని చెప్పారు. డెత్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు తీసుకుని ఫించన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులు అందరూ ఈ నెల 30వ తేదీకి ధ్రువపత్రాలు అందజేయాలని సూచించారు. ఏపీవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలని ఆలోచన చేసి ఆ దిశగా ఆచరణ చేస్తున్నామని అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీన నెల్లూరులో ఒక పార్కును ప్రారంభించి అక్కడి నుంచే వర్చువల్‌గా మరొక 50 పార్కులను ప్రారంభిస్తామని తెలిపారు. రెండేళ్లలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli