Header Banner

ఏపీలో తైవాన్ కంపెనీలు - ఆ దేశ ప్రతినిధులతో లోకేశ్ కీలక భేటీ! లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు!

  Thu Feb 13, 2025 19:45        Politics

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం కోరారు విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో నారా లోకేశ్ చర్చలు జరిపారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ తయారీ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉంది. సమావేశంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి  తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, తీసుకున్న చర్యల గురించి నారా లోకేశ్ తైవాన్ ప్రతినిధుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తీసుకొచ్చిన పాలసీలు, అనుమతుల దగ్గర నుండి ఉత్పత్తి ప్రారంభం వరకూ ప్రభుత్వం నుండి అందిస్తున్న సహకారం గురించి మంత్రి వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్దతిలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పలు ఉదాహరణలతో వివరించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

2014-19 వరకూ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి కల్పించిన మౌలిక సదుపాయాలు, అక్కడ ఏర్పాటైన అనేక కంపెనీలు తద్వారా వేలాదిగా యువతకు లభించిన ఉద్యోగ అవకాశాల గురించి తైవాన్ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వీటిని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి పని చేస్తున్నామని నారా లోకేశ్ అన్నారు. తైవాన్‌లో ఉన్న అనేక కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలతో ఉన్నాయని, ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు సహకారం అందించాలని లోకేశ్ కోరారు. ఆయా కంపెనీలు సులభంగా కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ ప్రత్యేక పార్కులు ఏర్పాటుకు సహకరించాలని మంత్రి కోరారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్  రంగాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తైవాన్ బృందం తెలిపింది. ఈ సమావేశంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్, నెక్సస్ ఇండో కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎరిక్ చాంగ్, ఏపీ ప్రభుత్వం తరపున ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

 

నేడు (13/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #NaraLokesh #Taiwan