Header Banner

ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!

  Sat Mar 22, 2025 18:29        Politics

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది.. కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు వివిధ నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు.. ఇక, మూడో జాబితాలో మరికొన్ని కీలక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్.. దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి చేశారు. 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా సిద్ధం అవుతోందట.. చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు రాగా.. ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు సాగుతున్నాయి.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్.. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు పూర్తిస్తాయి నివేదిక వెళ్లగా.. తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన సిఫార్సుల జాబితా కూడా చంద్రబాబు వద్దకు చేరిందని సమాచారం.. ఈసారి మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లను నియమించనున్నారు.. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రంగం సిద్ధం అవుతోంది.. మరోవైపు.. వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు..


ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!


ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.. ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు అయ్యింది.. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది అధిష్టానం.. రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీ చేయబోతున్నారు.. ఎస్సీ, ఎన్టీ, బీసీలతో పాటు ఓసీలకు సమ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట.. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలు కూడా సీఎం దగ్గరకు చేరాయట.. మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మొత్తంగా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్న కొందరు నేతలకు.. ఈ దఫాలు పదవులు దక్కనున్నాయి..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు.!

 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం! త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో..

 

రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!

 

చీప్‌.. వెరీ చీప్‌.. రూ. 599కే ఎయిర్‌ ఇండియా టికెట్‌.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!

 

USA: F-1 విద్యార్థి వీసా నుండి H-1B వర్క్ వీసాకు మారుతున్నారాకఠినతరం చేసే ఇమ్మిగ్రేషన్ విధానాలు! మరిన్ని వివరాలు మీ కోసం!

 

జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #nominated #post #kutami #APCM #CBN #update