Begumpet Airport: తీవ్ర ఉద్రిక్తం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు! బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు!
Wed Jun 18, 2025 12:24 Politics
హైదరాబాద్(Hyderbad): హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో బుధవారం ఉదయం కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ ద్వారా వచ్చిన సందేశం కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్(Bomb squad, dog squad) బృందాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను? సమంత క్లారిటీ.!
ప్రతి మూలను గాలించినప్పటికీ ఎటువంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యం కాలేదు. గంటల తరబడి విస్తృతంగా సోదాలు చేసిన అనంతరం విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో అటు పోలీసులు, ఇటు విమానాశ్రయ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి కావాలనే ఈ బెదిరింపు ఈమెయిల్ పంపి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సమాచారం.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Hyderabad #Begumpet #Airport #Bomb Threat #Tension #Email #Bomb Squad #Dog Squad
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.