Header Banner

వైసీపీకి భారీ ఎదురు దెబ్బ.. మరో మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి! గుంటూరు మేయర్ గా ఆయన పేరు కరారు!

  Mon Apr 28, 2025 07:01        Politics

రాష్ట్రంలో కీలకమైన విశాఖపట్నం, గుంటూరు నగరపాలక సంస్థల మేయర్ పీఠాలు కూటమి ఖాతాలోకి చేరనున్నాయి. రెండుచోట్లా సోమవారం మేయర్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ రెండు నగరపాలక సంస్థల్లో కూటమికి ఉన్న సభ్యుల ఆధిక్యంతో ఇద్దరు మేయర్ అభ్యర్థుల విజయం లాంఛనమే కానుంది. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్గా పీలా శ్రీనివాసరావు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కె. రవీంద్ర పేర్లు ఖరారయ్యాయి. ఈ నెల 19న విశాఖ నగర మేయర్ గా ఉన్న వైకాపాకు చెందిన హరి వెంకటకుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవీచ్యుతురాలయ్యారు. ఈ నగరపాలక సంస్థలో మొత్తం 97 మంది కార్పొరేటర్లలో ఒకరైన వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ప్రస్తుతం 96 మంది ఉన్నారు. ఇందులో తెదేపా, జనసేన, భాజపా కూటమికి 63 మంది సభ్యులున్నారు. మరో 11 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్అఫిషియో సభ్యులున్నారు. మొత్తం 74 మంది బలంతో మేయర్ అభ్యర్థిగా తెదేపాకు చెందిన శ్రీనివాసరావు ఎన్నికకు మార్గం సుగమమయినట్లే. గుంటూరు నగర మేయర్గా ఉన్న వైకాపాకు చెందిన మనోహర్ నాయుడి రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక్కడి మేయర్ ఎన్నికకు సంబంధించి కూటమికి ఉన్న సభ్యుల బలంతో కె.రవీంద్ర ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన స్థాయీ సంఘాల ఎన్నికల్లో ఎక్అఫిషియో సభ్యులతో కలిసి 37 మంది హాజరై కూటమి అభ్యర్థులను గెలిపించారు. అదే జోరులో మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే ప్రయత్నంలో కూటమి నేతలు ఉన్నారు.


ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?


పాలకొండ, తునిలోనూ కూటమి గెలుపు ఏకపక్షమే
పాలకొండ నగర పంచాయతీ, తుని పురపాలక సంఘం ఛైర్పర్సన్ల స్థానాలూ కూటమి పరం కానున్నాయి. ఈ రెండుచోట్లా ఎన్నికలు ఏకపక్షమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైకాపా ఛైర్పర్సన్ రాధాకుమారి రాజీనామాతో ఖాళీ అయిన పాలకొండ ఛైర్పర్సన్ స్థానానికి ఇప్పటికే రెండుసార్లు నిర్వహించిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోరంతో సంబంధం లేకుండా ఈసారి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక్కడ కూటమి తరపున ఎ.మల్లేశ్వరి ఎన్నికయ్యే అవకాశం ఉంది. తునిలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ స్థానాలకు కూటమి తరఫున ఎన్.భువనసుందరి, ఎ.సురేశ్ పేర్లను ఖరారు చేశారు. 30 వార్డులున్న తునిలో వైకాపాకు చెందిన 17 మంది సభ్యులు కూటమిలో చేరారు. ఇక్కడ వైస్ ఛైర్మన్ ఎన్నిక.. కోరం లేక రెండుసార్లు వాయిదా పడింది. ఇదే క్రమంలో వైకాపాకు చెందిన వై.సుధారాణి ఛైర్పర్సన్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ స్థానాలకు సోమవారం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కుప్పం ఛైర్పర్సన్ స్థానానికి కూటమి, వైకాపా పోటీ పడుతున్నాయి. మాచర్ల, తాడిపత్రి మున్సిపాల్టీల్లో మూడు వైస్ ఛైర్మన్ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: జీవీఎంసీ మేయర్ ఎన్నికలలో సంచలనం! టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఆయన ఖరారు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YSRCP #AllianceVictory #GunturMayor #PoliticalNews #AndhraPolitics