Header Banner

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

  Mon Mar 24, 2025 15:44        Business

భారత టెలికాం రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధానంగా ప్రభుత్వ సంస్థ BSNL వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఫ్యామిలీ ప్లాన్‌ను అనౌన్స్ చేసింది. దీని స్పెషల్ ఏంటంటే ఒకే రీఛార్జ్‌తో ముగ్గురు కుటుంబ సభ్యులు సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్ అన్ని పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం అమల్లో ఉంటుందని కంపెనీ తెలిపింది. దీంతో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.999 ఫ్యామిలీ ప్లాన్, వినియోగదారుల ఆదరణను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ప్లాన్ ద్వారా ఒక వ్యక్తి రీఛార్జ్ చేసుకుంటే, మరో ఇద్దరు కూడా దీని సేవలను పొందవచ్చు. ఈ విధంగా, ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకే ధరకు సేవలను వినియోగించుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ ప్లాన్ ద్వారా వ్యక్తిగత ప్లాన్‌ల అవసరాన్ని తొలగించి, కుటుంబంలో ఉన్న వారందరికీ సమానమైన సేవలు అందించడం సాధ్యమవుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్యామిలీ ప్లాన్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇది మూడు వేర్వేరు కనెక్షన్‌లను ఒకే రీఛార్జ్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి: యూపీఐ ద్వారా ఒక్క రోజులో ఎంత పంపించుకోవచ్చు.. కొత్త రూల్స్ ఇవే..!

 

దీంతో, వేర్వేరు వ్యక్తుల కోసం ప్రత్యేక రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకే ప్లాన్‌లో ముగ్గురు కుటుంబ సభ్యులు సేవలను పొందవచ్చు. ఆ క్రమంలో ప్రతి యూజర్‌కు సొంతంగా 75GB డేటా, రోజు 100 ఉచిత SMSలు, అపరిమిత ఉచిత కాలింగ్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. రూ.999 ఫ్యామిలీ ప్లాన్‌లో భాగంగా ప్రతి వినియోగదారునికి 75GB డేటా కేటాయించబడుతుంది. అంటే ఇది మొత్తం ముగ్గురికి కలిపి 300GB డేటా లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఒకేసారి వాడటానికి, అలాగే, ప్రతి యూజర్‌కు రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే అపరిమిత ఉచిత కాలింగ్. ఇది ప్రాథమిక వినియోగదారుకు మాత్రమే కాకుండా, కనెక్ట్ చేయబడిన ఇతర నంబర్లకు కూడా అపరిమిత ఉచిత కాలింగ్ సేవలను అందిస్తుంది. ప్రత్యేకంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఏ రకమైన ఫోన్ బిల్లు లేకుండా కాలింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రధానంగా టెలికాం ఖర్చులను తగ్గించుకోవాలనుకునే కుటుంబాలకు మంచి ఎంపికగా ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

 

అమెరికాలో మరో దారుణ ఘ‌ట‌న‌.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

 

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

 

టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BSNL #NewRchargePlan #GoodNews #Users