పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

  Wed Apr 02, 2025 11:06        Politics

పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యపోయేలా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పర్చూరు నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఒక హెచ్చరిక జారీ చేశారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీకి అత్యధిక ఓట్లు సాధించేలా కృషి చేసిన వారిని గుర్తిస్తామని చెప్పారు. పనితీరును ప్రామాణికంగా తీసుకుని నేతలు, కార్యకర్తలకు నామినేటెడ్, పార్టీ పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు. తనతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి రేటింగ్‌లు ఇస్తామని చెప్పారు. దాని ద్వారా పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా పక్కన పెడతానని హెచ్చరించారు. సమర్థులకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations