Header Banner

ఏపీలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్! అక్కడ రెండో బైపాస్ కు గ్రీన్ సిగ్నల్!

  Thu Apr 10, 2025 11:23        Politics

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించింది. పాత రోడ్ల మరమ్మత్తులతో పాటు, నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, బైపాస్‌లు, ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారంతో నూతన ప్రాజెక్టుల‌ను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు పశ్చిమ బైపాస్ రోడ్డును ప్రతిపాదించారు. ఇప్పటికే తూర్పు వైపు ఉన్న బైపాస్‌తోపాటు, చీమకుర్తి దిశ నుంచి వచ్చే గ్రానైట్ వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ బైపాస్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒంగోలు కలెక్టరేట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తమీమ్‌ అన్సారియా, ఇతర అధికారులు ఈ ప్రతిపాదనపై సమావేశమయ్యారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

పశ్చిమ బైపాస్ రోడ్డును త్రోవగుంట నుంచి పెళ్లూరు వరకు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ రహదారి ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు, ప్రమాదాలు తగ్గించి, భారీ వాహనాలను నగరంలోకి రాకుండా మళ్లించేందుకు దోహదపడుతుంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ ట్రాఫిక్ సమస్యలు, భారీ వాహనాల రాకపోకలను పరిగణనలోకి తీసుకొని డీపీఆర్‌ను రూపొందించాలంటూ అధికారులను కోరారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా బైపాస్ నిర్మాణానికి సంబంధించి సామాజిక, పర్యావరణ, ఇంజనీరింగ్ అంశాలపై సమగ్రంగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #RoadDevelopment #BypassRoad #UrbanPlanning #SmartInfrastructure #TrafficSolutions #InfrastructureGrowth