Header Banner

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

  Wed Apr 02, 2025 12:53        Politics

రాజధాని అమరావతి ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రావడమే కాకుండా, అక్కడి నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ను సులువుగా తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్ (చెన్నై-కోల్కతా హైవే బైపాస్) ఉంది. . అందులోని కాజా - గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్తుంది. వీటిలో 2-3, -8, -10, -13, 2-15 గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యేచోట్ల ఎన్హెచ్ఎఐ అండర్ పాస్లను నిర్మించింది. దీనివల్ల ఆయా గ్రిడ్ రోడ్లలో రాకపోకలు సాగించే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఇ-9, ఇ-11, ఇ-12, ఇ-14 గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్పాస్లు లేకుండానే, బైపాస్ నిర్మాణ పనులు పూర్తియయ్యిపోయాయి. దీంతో బైపాస్ క్రాస్ అయ్యేప్రాంతాల్లో ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఈ గ్రిడ్ రోడ్లపై రాకపోకలు సాగించేవారు.. బైపాస్ దాటి వెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

 

ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు లోకేశ్‌ శ్రీకారం! 20 ఎకరాల్లో రూ. 114.20 కోట్లతో..

 

ఈ విషయం తెలిసినా గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎన్హెచ్ఎఐ అధికారులు పనులు చేసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్పాస్లు లేని విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ అండర్పాస్లు ఉండాల్సిందేనని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ నాలుగు చోట్ల బైపాస్ను కట్చేసి, అండర్పాస్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది. తాజాగా సీఎం చంద్రబాబు, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీతో సమావేశం అయ్యి ఇదే అంశంపై చేర్చించారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్న వేళ మొదట బైపాస్ నిర్మాణం పూర్తిచేయాలని, ఆ తర్వాత నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్పాస్లు నిర్మించేలా ఇద్దరూ మాట్లాడుకుని, నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ప్రస్తుతం బైపాస్ ఆపేసి, నాలుగు చోట్ల అండర్పాస్ల నిర్మాణం పూర్తిచేయాలంటే మరో 15 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, తొలుత బైపాస్ పూర్తిచేయడానికే పచ్చ జెండా ఊపారు.. దీంతో ఈ పనులు మరింత వేగంగా సాగనున్నాయి. వర్షాలు మొదలయ్యే లోపు జూన్ ఆఖరుకు బైపాస్ పెండింగ్ పనులు అని పూర్తయ్యి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations