Header Banner

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

  Thu Apr 03, 2025 16:47        Politics

విశాఖపట్నంలోని రుషికొండ భవనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలలో పర్యటించాలని.. పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాలని సూచించారు. నెలలో నాలుగు రోజులు ప్రజాప్రతినిధులు పల్లె నిద్రలో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ చర్చ సందర్భంగా రుషికొండ ప్యాలెస్ ప్రస్తావన వచ్చింది. రుషికొండ ప్యాలెస్ గురించి మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ఆలోచనలు చేశారు. మొదట మంత్రులంతా రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించాలని చంద్రబాబు సూచించారు. మంత్రుల పర్యటన పూర్తైన తర్వాత ఏం చేద్దామనే దానిపై అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రుషికొండ భవనాలను మొత్తం 9.88 ఎకరాల విస్తీర్ణంలో ఏడు బ్లాక్‌లుగా నిర్మించారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయం సుమారు 400-500 కోట్ల రూపాయలుగా చెప్తుంటారు. ఇందులో ఖరీదైన ఇటాలియన్ మార్బుల్, ఫర్నీచర్, షాండ్లియర్లు, షవర్లు వంటివి ఉపయోగించారు. అయితే రుషికొండ ప్యాలెస్‌ను వీఐపీల కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్తుండగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ తన వ్యక్తిగత వినియోగం కోసం నిర్మించారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తుంటారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రుషికొండ భవనాలను కూటమి సర్కారు ఏం చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యావరణానికి భంగం కలిగించేలా, అనుమతులు లేకుండా రుషికొండ ప్యాలెస్ నిర్మించారని విపక్షంలో ఉన్న సమయలో టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించాయి. ప్రస్తుతం ఈ పార్టీలు అధికారంలోకి రావటంతో ఈ రుషికొండ ప్యాలెస్‌ను అలాగే కొనసాగిస్తారా లేదా కూల్చివేస్తారా అనే చర్చ జరిగింది. అయితే వందలకోట్లు ప్రజా ధనం వెచ్చించి నిర్మించిన భవనాలు కావటంతో.. వీటిని పర్యాటక రంగం కోసం లేదా మ్యూజియంగా ఉపయోగించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రుషికొండ ప్యాలెస్ సందర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులకు సూచించారు. సందర్శన తర్వాత మంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని తర్వాత రుషికొండ ప్యాలెస్ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations