Header Banner

ఇళ్ల పట్టాల అక్రమాలపై కూటమి ప్రభుత్వం సీరియస్! పునర్విచారణకు రెవెన్యూ శాఖ సిద్దం!

  Wed Feb 12, 2025 12:35        Politics

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. విచారణ
తప్పదని హెచ్చరిస్తోన్న విషయం విదితమే.. అయితే, వైసీపీ హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులు విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల స్థలాలు, పట్టాలు పొందిన లబ్ధిదారులపై పునర్విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.. దీనికోసం ఈ నెల 10వ తేదీ నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే వారిని గుర్తించాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.. ఇక, ఈ సమాచారాన్ని నమోదు చేసేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది.


ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 



ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పునర్విచారణ ప్రక్రియను ఆయా మండలాల్లో స్థానిక తహశీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయరు, వీఆర్వో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి.. ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ 26 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు సీసీఎస్ఏ జయలక్ష్మి.. దీంతో, వైసీపీ.. తమ పార్టీ వారికి అక్రమంగా కట్టబెట్టిన వ్యవహారం బయటపడుతుందిన కూటమి నేతలు చెబుతున్నారు..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ykapa #landmafiya #governamentlands #todaynews #flashnews #inquiry #latestupdate