Header Banner

వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వెల్లడి.. సాక్షుల మరణాల పట్ల ఆందోళన! ఎస్పీకి వినతిపత్రం అందించిన దస్తగిరి..

  Wed Mar 12, 2025 15:05        Politics

వివేకా హత్య కేసులో (Viveka Murder Case) అప్రూవర్ దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. గతంలో ఉన్న భద్రతనే ఇప్పుడూ కొనసాగించాలని అందులో కోరారు. వివేకా హత్య కేసులో సాక్షులు చనిపోతున్నందున రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు వినతి పత్రం ఇచ్చిన అనంతరం దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ.. "వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో.. ఎవరు చంపించారో.. అందరికీ తెలుసు. జగన్ రెడ్డి మాతో తప్పు చేయించి దర్జాగా తిరుగుతున్నారు. ఈ కేసులో బహిరంగంగా నాతో మాట్లాడేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? ఆయన ఇంటికి దగ్గరలోనే నేను నివాసం ఉంటున్నందున వారి నుంచి ప్రాణహాని ఉంది. అందుకే మరింత భద్రత పెంచాలని పోలీసులను కోరుతున్నాను. 2021లో నేను మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే కుట్రదారుల వివరాలు బయటకు వచ్చాయి. నేను చెప్పింది తప్పని ఆరోజే జగన్ ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదు? వారి కుట్రలు బయట పడతాయని అప్పట్లో ఏమీ మాట్లాడలేదు. డాక్టర్ చైతన్య రెడ్డి నన్ను జైల్లో బెదిరించిన ఘటనపై సమగ్ర విచారణ జరగాలి. త్వరలోనే సీబీఐ అధికారులు ఈ కేసుపై విచారణ చేస్తామని చెప్పారు” అని దస్తగిరి పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: వైసిపి మరో బిగ్ షాక్! కీలక నేతలు నోటీసులు… ఎన్ని కేసులు నమోదు ఆంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #DastagiriKadapa #SPProtection #YSViveka #MurderCase