Header Banner

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

  Sat Mar 22, 2025 16:18        Travel

హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతి నిత్యం వందల సంఖ్యలో విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లాలన్నా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ఉండగా.. మరికొన్ని దేశాలకు మాత్రం కనెక్టింగ్ సర్వీసులు నడుపుతున్నారు. తాజాగా శంషాబాద్ నుంచి మరో దేశానికి డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. వియత్నాం వెళ్లే విమాన ప్రయాణికుల కోసం వియట్‌జెట్‌ ఎయిర్‌వేస్ సంస్థ కొత్తగా సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం (మార్చి 19) నుంచి వియత్నాంకు డైరెక్ట్‌ ఫ్లైట్‌ నడుపుతున్నారు. వారానికి రెండు రోజులు మంగళ, శనివారాల్లో ఈ సర్వీసు నడుపుతున్నట్లు విమానయాన సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రతి మంగళవారం వియత్నాంలోని హోచిమిన్‌ నగరంలో రాత్రి 7.40 గంటలకు బయలుదేరే VJ-1803 ఫ్లైట్ సర్వీసు హైదరాబాద్‌కు రాత్రి 10.35 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో VJ - 1804 ఫ్లైట్ రాత్రి 11.35 గంటలకు హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు హోచిమిన్‌ సిటీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.

 

ఇది కూడా చదవండి: విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

భారత్‌ కాలమానంకంటే వియత్నాం దేశ కాలమానం 1.30 గంటలు ముందుంటుందనే విషయం గమనించాలి. హైదరాబాద్ నగరంతో వివిధ దేశాల మధ్య పర్యాటకం మరియు వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఈ కొత్త విమాన సర్వీస్ కీలక పాత్ర పోషిస్తుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పనికర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని.. దాదాపు 4 గంటల 35 నిమిషాల విమాన సమయంతో భారత్-వియత్నాం మధ్య ఎయిర్వేస్ కనెక్టివిటీ బలోపేతం అవుతుందని చెప్పారు. పర్యాటకం, వ్యాపార సహకారాలు అందించటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని సూచించారు. వియట్‌జెట్ వైస్ ప్రెసిడెంట్ డో జువాన్ క్వాంగ్ మాట్లాడుతూ.. ఇండియా వియట్ జెట్‌కు కీలకమైన మార్కెట్ అని అన్నారు. హైదరాబాద్ నగరం హో చిమిన్ సిటీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించటం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది రెండు దేశాల మధ్య వ్యాపారం, పర్యాటక సంబంధాలను బలపరుస్తుందని అన్నారు.

 

ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!

ఆంధ్రప్రదేశ్​లో క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. అల ఆకాశంలో.. జాలీ జాలీగా ప్రయాణం.!

 

ఏపీలో విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్! హాల్ టికెట్లు నిలిపితే కఠిన చర్యలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోట్లు విడుదల!

 

అమెరికా: భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన.. కచ్చితంగా అలా చేయాల్సిందే.!

 

చరిత్రలో తొలిసారి... అప్పుడు మూడు నెలల పాటు తిరుమల ఆలయాన్ని మూసివేయాలనుకున్న అధికారులు! ఏం జరిగింది? మరి ఇప్పుడు...

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices