Header Banner

ట్రంప్ ట్రేడ్ వార్.. ఇక అన్ని దేశాలకు - చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోనివిధంగా! స్టాక్ మార్కట్‌ ఒడిదుడుకులపై..

  Mon Mar 31, 2025 15:29        U S A

భారత్, చైనాలపై ప్రతీకార సుంకాలను (Tariffs) ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు. వాణిజ్య యుద్ధం కేవలం 10-15 దేశాలకు మాత్రమే పరిమితం కాబోదని.. ప్రపంచంలోని అన్ని దేశాలపైనా సుంకాలు విధిస్తామని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. అగ్రరాజ్యం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే ఈ చర్యలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు. “చాలా ఏళ్లుగా మేము ప్రపంచదేశాలతో ఉదారంగా వ్యవహరించాము. కానీ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోనివిధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య పాలసీల విషయంలో కొన్ని సార్లు అమెరికా మిత్రదేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశబ్దాలుగా వారు మనపై విధించిన, వివిధ పేర్లతో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువ.

 

ఇది కూడా చదవండి: ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. భారతీయులకు భారీ షాక్! గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ను ఆపేసిన అమెరికా...

 

కాబట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచదేశాలన్నిటిపైనా మా వాణిజ్య టారిఫ్లు అమలవుతాయి” అని ట్రంప్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే ప్రతీకార సుంకాలను తప్పించుకునేందుకు అమెరికా దిగుమతులపై టారిఫ్ కోతల వైపు భారత్ మొగ్గుచూపుతోంది. ఈక్రమంలో రెండు దేశాల మధ్య మొదలైన ట్రేడ్ అండ్ టారిఫ్ చర్చల్లో (India-US Tariff Talks) భారత్ ధృఢవైఖరిని ప్రదర్శిస్తోంది. కొన్ని వస్తువులపై టారిఫ్ కోతలకు అంగీకరించినప్పటికీ.. దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. "సుంకాలు తగ్గించినంత మాత్రాన అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదు" అని ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి పేర్కొన్నారు. మరోవైపు అమెరికా నుంచి మన దేశంలోకి వస్తున్న ఉత్పత్తులపై ఇక్కడ ఎంత సుంకం విధిస్తే, ఇక్కడినుంచి అమెరికాకు చేరుతున్న అదేతరహా ఉత్పత్తులపై సమాన సుంకాన్ని ఏప్రిల్ 2 నుంచి అమలుచేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% సుంకం విధిస్తుండగా.. అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకం సగటు 12 శాతంగా ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhra