Header Banner

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

  Thu Apr 17, 2025 08:31        Politics

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరి దంపతులు హైదరాబాద్‌లోని సూరారంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే, అద్దె ఇంట్లో ఇబ్బంది అవుతుండటంతో కొడుకు ఇంట్లో ఉంటామంటూ నిన్న కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో లావణ్య వారిని అడ్డుకున్నారు. కోర్టులో కేసులు ఉండటంతో ఇంట్లోకి రావడం కుదరదని చెప్పారు. అంతగా ఇంట్లోకి రావాలనుకుంటే పోలీసులతో మాట్లాడిన తర్వాత రావాలని చెప్పారు. దీంతో వారు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమపై దాడికి వచ్చారని ఆరోపించారు. ఈ ఇంటిని తాను, రాజ్ తరుణ్ కలిపి కొన్నామని, తాను రూ. 70 లక్షలు ఇచ్చానని చెప్పారు.

ఇప్పుడు వారి తల్లిదండ్రులు వచ్చి ఆ ఇల్లు తమదని అంటున్నారని పేర్కొన్నారు. ఆ ఇంటిపై తనకు హక్కు ఉందని తెలిపారు. తాము ఆ ఇంటిని కొన్నప్పుడు రూ. 1.5 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు రూ. 12 వరకు ఉంటుందని వివరించారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఈ వివాదంపై రాజ్ తరుణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. విషయం తెలిసిన కొరియోగ్రాఫర్ శేఖర్‌బాషా అక్కడికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటానని చెప్పారు. కాగా, ఈ విషయమై తమకు ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేని నార్సింగి పోలీసులు తెలిపారు.


ఇది కూడా చదవండిఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RajTarun #Lavanya #TollywoodDrama #FamilyDispute #PropertyRow #CourtCase