Header Banner

చరిత్రలో తొలిసారి... అప్పుడు మూడు నెలల పాటు తిరుమల ఆలయాన్ని మూసివేయాలనుకున్న అధికారులు! ఏం జరిగింది? మరి ఇప్పుడు...

  Sat Mar 22, 2025 11:02        Devotional

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సందర్భంగా తిరుమల ఆలయానికి సంబంధించి గతంలో ఎదురైన కీలక సమస్య గురించి వెల్లడించారు. గతంలో తన ముఖ్యమంత్రి హయాంలో తిరుమలలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడిందని, రోజూ 600 నుంచి 800 ట్యాంకర్ల ద్వారా నీటిని తిరుపతి నుంచి తిరుమలకు తీసుకురావడం కష్టమైపోయిందని అన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు మూడు నెలల పాటు ఆలయాన్ని మూసివేయాల్సి ఉంటుందని తనతో చెప్పారని, అయితే ఆ మాట విన్న వెంటనే తాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. ఆలయాన్ని మూసివేయడం చరిత్రలో రాయాల్సిన పరిస్థితి వచ్చేస్తుందని భావించి తాను వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించానని చంద్రబాబు గుర్తు చేశారు.

 

ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!

 

ఆ సమయంలో ఆయన కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు నీటిని సరఫరా చేసే విధంగా పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ పనిని 90 నుంచి 95 రోజుల్లోనే పూర్తి చేసిందని అన్నారు. అదే సమయంలో తిరుమలకు నిరంతర నీటి సరఫరా కల్పించేందుకు సోమశిల, కండలేరు, బాలాజీ రిజర్వాయర్‌లను అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తిరుమలకు నీటి సమస్య లేకుండా ఉండటానికి ఆ నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. అదేవిధంగా, తిరుపతిలో కూడా నీటి సమస్య తలెత్తకుండా మల్లిమడుగు ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. తాము తెలుగు గంగ ప్రాజెక్టును తీసుకొచ్చి నీటి సమస్యను పరిష్కరించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు.!

 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం! త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో..

 

రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!

 

చీప్‌.. వెరీ చీప్‌.. రూ. 599కే ఎయిర్‌ ఇండియా టికెట్‌.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!

 

USA: F-1 విద్యార్థి వీసా నుండి H-1B వర్క్ వీసాకు మారుతున్నారాకఠినతరం చేసే ఇమ్మిగ్రేషన్ విధానాలు! మరిన్ని వివరాలు మీ కోసం!

 

జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #TirumalaCrisis #ChandrababuLeadership #TirumalaWaterIssue #SaveTirumala #TempleShutdownAvoided