Header Banner

రాజధానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ADB నుంచి నిధులు! మంత్రి నారాయణ కీలక ప్రకటన!

  Wed Mar 05, 2025 21:36        Politics

 

అమరావతి రాజధాని అంశంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాల మాటలను ప్రజలు వినవద్దని, నమ్మవద్దని సూచించారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని స్పష్టం చేశారు. మొత్తం 64 వేల కోట్ల రూపాయల వ్యయంతో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

217 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ రాజధానికి ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 5 వేల ఎకరాలను లాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని, రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటామని తెలిపారు. రాజధాని పూర్తిగా స్వయంసమృద్ధిగా (Self-Sufficient) ఉండేలా సీఎం సూచించారని వివరించారు.

 

రాజధాని నిర్మాణాన్ని పూర్తి ప్రణాళికతో (Well-Planned) చేపడుతున్నామని, ఇందులో 1000 నుంచి 1200 ఎకరాలను అంతర్జాతీయ యూనివర్శిటీలు, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలకు కేటాయించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణం పారదర్శకంగా కొనసాగుతుందని, ఎలాంటి అవకతవకలకు తావుండదని నారాయణ హామీ ఇచ్చారు. నిర్మాణ పనులు S S R రేట్ల ప్రకారమే చేపడతామని, గత ప్రభుత్వంలా నిధులను మళ్లించబోమని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 6 వేల కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని సీఎం చెప్పారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #AmaravatiCapital #APDevelopment #MinisterNarayana #CapitalCityPlan #TransparentGovernance #SelfSufficientCity #InfrastructureGrowth #InternationalStandards #NoTaxBurden #PlannedDevelopment