దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!
Mon Mar 31, 2025 11:00 India
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో దారుణం జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువతి శనివారం సాయంత్రం బంధువుతో కలిసి ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. దైవదర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్రపోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో కాలకృత్యాల కోసం సమీపంలోని గుట్టప్రాంతంలోకి వెళ్గగా అప్పటికే అక్కడ ఉన్న 8 మంది యువకులు యువతిని అడ్డుకున్నారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడిచేసి చేతులు కట్టేశారు. ఆపై యువతిని బలవంతంగా సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులను ఊర్కొండపేటకు చెందినవారిగా గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
70 వేల లంచం కోసం పథకం.. కానీ సీబీఐ వలకు చిక్కిన బీఐఎస్ అధికారి! భారీ అవినీతి గుట్టురట్టు!
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..
ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!
ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..
నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు! మద్రాస్ ఐఐటీలో జరిగే..
మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.