Header Banner

రామ్మోహన్ ప్రకటనపై గంటా హర్షం.. థాంక్యూ వెరీ మచ్.. మీ ప్రకటన విశాఖ విమాన ప్రయాణికుల్లో ఆనందం!

  Fri Apr 18, 2025 14:48        Politics

ఇటీవల విశాఖ నుంచి విజయవాడకు మార్నింగ్ ఫ్లయిట్స్ రద్దు చేయడం వల్ల... విశాఖ నుంచి అమరావతి రావాలంటే హైదరాబాద్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ... విశాఖ నుంచి కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిపోయిన అన్ని దేశీయ, విదేశీ విమాన సర్వీసులను నెల రోజుల్లోపు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలోని ప్రతి విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాజాగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన పట్ల గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. థాంక్యూ వెరీ మచ్ రామ్మోహన్ నాయుడు... అంటూ కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక కారణాలతో విశాఖ నుంచి ఆగిపోయిన అన్ని దేశీయ, విదేశీ విమానాలను నెలరోజుల్లోపు పునరుద్ధరిస్తామని, దీనిపై విమాన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్న మీ ప్రకటన విశాఖ విమాన ప్రయాణికుల్లో ఆనందం నింపిందని గంటా తెలిపారు. మీ చొరవతో ఐటీ, టూరిజం, ఫార్మా తదితర కీలక రంగాల్లో వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేలా భవిష్యత్ లో ఎయిర్ కనెక్టివిటీ పెరగాలని, కొత్త సర్వీసులు ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాం అని గంటా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia