Header Banner

సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ అభ్యర్థులకు శుభవార్త! చివరి అవకాశాన్ని వదులుకోవద్దు!

  Wed Feb 19, 2025 11:56        Others

యూపీఎస్సీ యేటా నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ నియామక పరీక్ష 2025 నోటిఫికేషన్‌ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ పొడిగించింది. అఖిల భారత సర్వీసులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 21వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటనల జారీ చేసింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా.. అధికారులు ఆ గడువును ఫిబ్రవరి18వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు మంగళవారంతో ముగియడంతో తాజాగా మరోమారు గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


ఇది కూడా చదవండి: గుండె సమస్యలను దూరం చేసే చిన్న చిట్కా! వంటిట్లోని వన మూలికలతో ఇలా చెస్తే..



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కలిగింది. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకోవచ్చని యూపీఎస్సీ తన ప్రకటనలో వెల్లడించింది. కాగా మొత్తం 979 సివిల్ సర్వీసెస్‌ పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ పోస్టులకు కూడా దరఖాస్తు గడువు పొడిగిస్తూ యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు సైతం దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 21, 2025వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా ముందుగానే దరఖాస్తులు చేసుకోవాలని, చివరి రోజున సర్వర్ బిజీగా ఉండే ఛాన్స్‌ ఉందని యూపీఎస్సీ సూచించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇతర వివరాలు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #upsc #civils #notification #todaynews #flashnews #latestupdate