Header Banner

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

  Fri Apr 18, 2025 08:55        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, అందులో ఒంగోలు కూడా ఒకటి. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలంలోని అల్లూరు దగ్గర విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.115.78 కోట్లు మంజూరు చేసింది. భూసేకరణ కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్థల సర్వే కోసం రూ.2.27 కోట్లు విడుదల చేయగా, AAI అధికారులు మూడు నెలల క్రితం పరిశీలన చేసి డిజైన్‌లో కొన్ని మార్పులు సూచించారు. నల్లవాగు వంటి భూభాగాల కారణంగా వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

ఈ ప్రాజెక్టు వైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్పీడ్ వచ్చింది. ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రత్యేకంగా ఈ అంశంపై దృష్టి పెట్టారు. కలెక్టర్ నివేదిక ప్రకారం, కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య 657.57 ఎకరాల వాన్‌పిక్‌ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమతో ప్రముఖంగా ఉండటంతో, విమానాశ్రయం వస్తే వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు), ఇతర ప్రయాణికులు విజయవాడ, చెన్నై, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుల మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఒంగోలులో ఎయిర్‌పోర్ట్ వస్తే, తూర్పు బైపాస్‌కు దగ్గరగా ఉండడం వల్ల ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుంది.

 

ఇది కూడా చదవండివిజయమ్మపై విజయసాయిరెడ్డి అనూహ్య ట్వీట్ వైరల్! వైఎస్ కుటుంబాన్ని వీరిద్దరూ వదల్లేరు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #OngoleAirport #OngoleDevelopment #PrakasamProgress #AndhraAirports #OngoleFlyingHigh