Header Banner

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

  Sun Mar 23, 2025 11:20        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో, వేలాది మంది అర్హులు పింఛన్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు అందుతున్న విజ్ఞప్తుల్లో పింఛను దరఖాస్తులే అధికంగా ఉంటున్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు దాటినా, నూతన పింఛన్లు ఇంతవరకు మంజూరు కాలేదు. అనర్హుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. దీంతో కొత్త పింఛన్లు మంజూరవుతాయనే ఆశతో ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్‌లకు అర్హులుగా ఉన్నారని, వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!

ఆంధ్రప్రదేశ్​లో క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. అల ఆకాశంలో.. జాలీ జాలీగా ప్రయాణం.!

 

ఏపీలో విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్! హాల్ టికెట్లు నిలిపితే కఠిన చర్యలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోట్లు విడుదల!

 

అమెరికా: భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన.. కచ్చితంగా అలా చేయాల్సిందే.!

 

చరిత్రలో తొలిసారి... అప్పుడు మూడు నెలల పాటు తిరుమల ఆలయాన్ని మూసివేయాలనుకున్న అధికారులు! ఏం జరిగింది? మరి ఇప్పుడు...

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations