Header Banner

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

  Wed Mar 26, 2025 14:07        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని గతేడాదే అమలు చేయడం ప్రారంభించింది. అయితే నాలుగు నెలలకోసారి ఒక్క గ్యాస్ సిలెండర్ చొప్పున ఏడాదికి మూడు సిలెండర్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీని ప్రకారం డిసెంబర్ లో ప్రారంభమైన ఈ పథకంలో తొలి గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునే గడువు ఈ నెల 31 వరకే ఉంది. దీంతో ఆ లోపు బుక్ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం మార్చి 31 వరకే ఉందని, ఇప్పటివరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ మరోసారి కోరారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: మూడో విడత నామినేటెడ్‌ పోస్టులు ఖరారు.. ఆశావాకుల ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!


ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందని, పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారన్నారు. ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారని, వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ -జూలై (01), ఆగష్టు -నవంబర్ (01), డిసెంబర్ -మార్చి (01) మధ్య ఉచిత గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలుగా ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం, రైస్ కార్డ్, ఆథార్ కార్డు, ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలని తెలిపారు. ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!

 

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

 

తీవ్ర ఆవేదన.. సీనియర్ నటుడుపవన్ కల్యాణ్ గురువు కన్నుమూత! ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుద‌ల!

 

వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?

 

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్బాలయ్యగోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FreeGasScheme #WomenEmpowerment #LPGSubsidy #GovernmentScheme #Dheepa2 #GasCylinder #APGovernment #WelfareScheme