Header Banner

ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త.. ఆ ఏరియాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రణాళిక! ఇక అక్కడ భూముల ధరలకు రెక్కలు!

  Wed Apr 23, 2025 11:49        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి‌పై ఫుల్‌గా ఫోకస్ పెట్టింది.. వచ్చే నెల 2న ప్రధాని మోదీ చేతులు మీదుగా అభివృద్ధి పనుల్ని ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో మెరుగైన మౌలికవసతులు కల్పించేందుకు.. భవిష్యత్ అవసరాలను గమనించి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టు (TEFR) కోసం కన్సల్టెంట్‌ను నియమించనుంది.. ఈ మేరకు ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APADCL) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP)ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో 5 వేల ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల మంత్రి నారాయణ అమరావతి పరిధిలోని భూముల్ని కూడా పరిశీలించారు. అమరావతి విమానాశ్రయం కోసం APADCL అధికారులు కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. ఈ ఎయిర్‌పోర్టును ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు దీనికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర నివేదికను 32 వారాల్లో అందజేయాలని APADCL గడువు విధించింది. RFPలో కన్సల్టెన్సీ సంస్థ చేయాల్సిన సర్వేల గురించి వివరంగా పేర్కొన్నారు. ముందుగా అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి: మరో బైపాస్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! ఆ భూముల రేట్లకు హద్దుల్లేవ్!



అనంతరం టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించి.. భూమికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. విమానాశ్రయం కోసం ప్రతిపాదనలు చేసిన స్థలాన్ని సర్వే చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫైనాన్షియల్ మోడల్‌పై నివేదిక, పర్యావరణ, సోషల్ ఇంపాక్ట్ సర్వే చేస్తారు.

కన్సల్టెన్సీ సంస్థ డిమాండ్, మార్కెట్ అంచనా, కేస్ స్టడీ, ఉత్తమ విధానాలు వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర సౌకర్యాలు, ట్రాఫిక్ డిమాండ్ అంచనా, ఆర్థికంగా లాభదాయకమా కాదా వంటి అంశాలను క పొందుపరచాల్సి ఉంటుంది. ప్రతిపాదించిన విమానాశ్రయంలో ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్ డిజైన్లను రూపొందించాలి. వీటతో పాటుగా కార్లు, బస్సులు, కార్గో వాహనాల పార్కింగ్ స్థలాలను నిర్ణయించాలి. పర్యాటకుల కోసం విమానాశ్రయంలో వసతి సౌకర్యాలు, భద్రతా చర్యల గురించి కూడా నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును అన్ని విధాలా పరిశీలించి, సాధ్యమైనంత ఉత్తమంగా నిర్మించే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇక్కడ అక్కడ చుట్టూ భూముల రెట్లు అధికంగా పెరుగుతాయి అనే చెప్పవచ్చు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GreenfieldAirport #LandBoom #RealEstate #APDevelopment #AmaravatiAirport #InfrastructureGrowth