Header Banner

వారికి గుడ్‌న్యూస్! రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. త్వరలోనే ఆ పథకం అమల్లోకి!

  Thu Apr 24, 2025 18:36        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా సంగంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆధునిక రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత సులభతరం కల్పించడంతో పాటు, అందులో ఉన్న వివరాలను సులభంగా గుర్తించేందుకు సహాయపడతాయని చెప్పారు.

పాత రేషన్ కార్డుల్లో మార్పులు
ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. రేషన్ కార్డుల జాబితాను శుద్ధి చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయంగా కార్డులు మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో నకిలీ రేషన్ కార్డులను నివారించే అవకాశముంది.

హమాలీ ఛార్జీలు రెండు రోజుల్లో విడుదల
అదేవిధంగా, రైతులకు పెండింగ్లో ఉన్న రవాణా మరియు హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇది రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా మారనుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, అలాగే రైతులకు చేయనున్న చెల్లింపులు ప్రభుత్వ సంక్షేమ చర్యలకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! ప్రైవేట్ స్కూల్‌లో ఉచిత సీటు పక్కా.. దరఖాస్తులు ప్రారంభం!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RationCardUpdate #GoodNews #APGovernment #WelfareSchemes #DigitalRationCard