Header Banner

రోడ్డుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం.. నారా లోకేష్ హామీ! భూముల ధరలకు రెక్కలు!

  Thu Apr 17, 2025 20:35        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న 13.8 కిలోమీటర్ల R&B రోడ్డును 100 అడుగుల వెడల్పుతో విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ విస్తరణకు రూ.250 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు. ఇది మంత్రి నారా లోకేష్ 2024 ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చిన అంశంలో భాగంగా తీసుకొచ్చారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉన్న SEZలు, పరిశ్రమలు, బార్క్ నిర్మాణం, నేవల్ బేస్ వంటి అభివృద్ధి ప్రాజెక్టుల వలన రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రస్తుతం ఉన్న సింగిల్ లేన్ రోడ్డు సరిపోవడం లేదని, ప్రయాణ సమయం ఎక్కువగా పడుతోందని అధికారుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో, రోడ్డును విస్తరించడం ద్వారా ప్రయాణ సౌలభ్యం మెరుగవుతుందని భావిస్తున్నారు.

 

అయితే, రోడ్డులో విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, భూములు కోల్పోతున్న అనకాపల్లి, మునగపాక, అచ్యుతాపురం మండలాల పరిధిలోని సుమారు 1,200 మంది బాధితులు నష్టపరిహారం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారంతా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. వేరే రూపంలో ఇచ్చే TDR బాండ్లను వారు తిరస్కరించారు. ఇప్పటికే వారు మంత్రి లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మంత్రి కూడా ప్రజాభిప్రాయం మేరకే పనులు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #AnakapalliToAchyutapuram #RoadWidening #APDevelopment #NaraLokesh #RoadExpansion