Header Banner

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

  Sun Feb 23, 2025 14:13        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీ ముహూర్తం ఖరారు చేసింది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కొత్త రేషన్ కార్డుల లబ్ది దారులు ఈ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. రేషన్ కార్డులు ఉన్న వారిలో అనర్హులను గుర్తించేలా కసరత్తు చేస్తోంది. కొత్త దరఖాస్తులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు. పాత కార్డు ల్లోనూ మార్పులు - చేర్పులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో మొదలు కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ పైన నిర్ణయం ప్రకటించింది. జనవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తొలుత భావించింది. కానీ, అమలు కాలేదు. లబ్ది దారుల నుంచి వస్తున్న ఒత్తిడితో కొత్త కార్డుల పంపిణీ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. గత ఏడాదిన్నార కాలం గా కొత్త కార్డులు పంపిణీ రాష్ట్రంలో జరగలేదు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసి ఉన్నారు.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష!


ఇక, పాత కార్డులు ఉన్న అనర్హులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టి నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త కార్డుల మంజూరుకు సంబంధించి అర్హతలు - మార్గదర్శకాల ను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది. మార్పులు - చేర్పులు వైసీపీ హయాంలోనే కొత్త రేషన్‌ కార్డులు, మార్పులు చేర్పులకు సంబంధించిన రూ.3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఛాన్స్‌ కల్పిస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. ఇప్పుడు ఛాన్స్‌ కల్పిస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అధికా రులు భావిస్తున్నారు. దీంతో..కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేసారు. వచ్చే నెల నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త రేషన్‌ కార్డులు అందిస్తామని వెల్లడించారు. పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామని చెప్పారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మద్దతుగా నిలుస్తాం రైతులకు సంబంధించి అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు నుంచి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నామని వివరించారు. రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకు మించి రావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి మనోహర్ ప్రకటించారు. ఈ రోజు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి విషయంలోనూ రైతులకు మంచి చేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్​లో 33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 5.87 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 7,480 కోట్ల రూపాయలు జమచేసినట్లు వివరించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #rationcard #apply #newcards #changes #todaynews #flashnews #latestupdate