Header Banner

జీవీ రెడ్డి రాజీనామా కలకలం! తిరిగి టీడీపీలోకి.. కీలక నేతగా రీ ఎంట్రీ?

  Wed Feb 26, 2025 13:31        Politics

టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ వివాదంగా మారింది. జీవీ రెడ్డి రాజీనామాతో పార్టీ కేడర్ అంతా ఒక్కటి అయింది. టీడీపీ నాయకత్వాన్ని నిలదీసింది. సోషల్ మీడియాలో వేలాది పోస్టింగ్స్ జీవీ రెడ్డికి మద్దతుగా వచ్చాయి. పార్టీ ఇలాంటి వారిని వదులుకోవద్దంటూ కేడర్ నినదించింది. చంద్రబాబు, లోకేష్ తమ వైఖరి మార్చుకోవాలని సూచనలు చేసారు. జీవీ రెడ్డి విషయంలో పునరాలోచన చేయా లని డిమాండ్ చేసారు. ఈ సమయంలో జీవీ రెడ్డి పైన టీడీపీ నాయకత్వం కొత్త ఆలోచన చేస్తున్న ట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. మరో ముఖ్య పదవి ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. జీవీ రెడ్డి రాజీనామాతో కూటమి ప్రభుత్వం లో ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తాజాగా తన పదవితో పాటుగా టీడీపీకి రాజీ నామా చేసారు. ఫైబర్ నెట్ లో చోటు చేసుకున్న పరిణామాలు.. అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవటం పైన జీవీ రెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసారు.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశా లను ప్రభుత్వానికి డామేజ్ చేసే విధంగా ఓపెన్ గా మాట్లాడటం పైన మందలించినట్లు సమా చారం. దీంతో, జీవీ రెడ్డి తన పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేసారు. తాను భవిష్యత్ లో ఒక ఏ పార్టీలో చేరనని జీవీ రెడ్డి స్పష్టం చేసారు. కేడర్ మద్దతు జీవీ రెడ్డి రాజీనామా పైన టీడీపీ కేడర్ స్పందించింది. జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదించటం పైన కేడర్ ముక్తకంఠం తో ఖండించింది. చంద్రబాబు, లోకేష్ ను పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేది కగా ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేసే నేతలు, కేడర్ కంటే అధికారులకే ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీసారు. ఆత్మగౌరవం కోసమే జీవీ రెడ్డి రాజీనామా చేసారంటూ.. ఆయనకు మద్దతుగా నిలిచారు. జీవీ రెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేసారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


అధికారంలో లేనప్పుడే పార్టీ కోసం పోరాడిన వ్యక్తి.. ఇప్పుడు రాజీనామా చేయడంపై టీడీపీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చురకలు అంటించారు. తాజా ఆఫర్ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నాయకత్వం పైన కేడర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయ టంతో ఇప్పుడు పార్టీ పునరాలోచనలో పడినట్లు సమాచారం. కేడర్ ఆగ్రహాన్ని తగ్గించేందుకు పార్టీ ముఖ్యులు ఇప్పటికే జీవీ రెడ్డితో టచ్ లోకి వెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తిరిగి పార్టీ లో యాక్టివ్ కావాలని కోరుతున్నారు. పార్టీ కేడర్ ఈ స్థాయిలో మద్దతుగా నిలుస్తున్న జీవీ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. జీవీ రెడ్డి తిరిగి పార్టీలో యాక్టివ్ అయితే.. ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఫైబర్ నెట్ పదవి మరో యువ నేతకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు జీవీ రెడ్డి పార్టీ నేతల ప్రతిపాదన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... జీవీ రెడ్డి ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.


ఇది కూడా చదవండి
: వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!



ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #gvreddy #fibernet #rajinama #re-entry #todaynews #latestnews