Header Banner

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

  Mon Mar 24, 2025 12:58        Health

ఏపీలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, చేతికి అందివచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వాన కురుస్తుందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. దీనికి తోడు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని... సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో... వర్షాలు కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా సిద్ధం! కీలక పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు! సీఎం వద్దకు ఫైనల్ లిస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

 

అమెరికాలో మరో దారుణ ఘ‌ట‌న‌.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

 

వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు - ఏ-1గా మాజీ మంత్రి.! పోలీస్ రంగం సిద్దం - ఈ కేసులో మరో కీలక అంశం!

 

వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! పింఛన్ లో కొత్త మలుపు..

 

టీటీడీ కీలక అప్డేట్.. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

 

గుడ్‌న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆ దేశానికి డైరెక్ట్‌ ఫ్లైట్‌! వారానికి రెండుసార్లు ఈ విమాన సర్వీసు.!

 

విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక వారి అకౌంట్ లో డబ్బులు జమ...

 

ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్! ఇలా చేయండి, లేకపోతే పథకాలు రావు, సరుకులు కట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather