Header Banner

గతంలో హౌస్ అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన హోం మంత్రి! సేవాభావానికి మరో ఉదాహరణ!

  Sun Mar 09, 2025 11:57        Politics

టీచర్‌గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న వంగలపూడి అనిత, ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. బిజీ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో ఉంటారు. అంతేకాదు తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు సైతం ఎవరైనా ఆపదకు గురైతే వెంటనే కాన్వాయ్ ను ఆపి పరామర్శించి వెళ్తారు. అయితే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు హోం మంత్రి అనిత గొప్ప మనసును చాటుకున్నారు. తన శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చారు. అంతేకాదు ఎంవీపీ పీఎస్ లో పనిచేస్తూ గర్భిణిగా ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్ రేవతికి కు సీమంతం చేశారు. హోం మంత్రి ఏకంగా తన ఇంటికి వచ్చి ఆశీర్వదించినందుకు మహిళా కానిస్టేబుల్ రేవతి భావోద్వేగానికి గురయ్యారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!


తన ఇంటికి వచ్చి తన కుటుంబ పరిస్థితి, యోగక్షేమలు తెలుసుకోవడంతో పాటు గర్భిణిగా ఉన్న తనకు సీమంతం చేసి ఆశీర్వదించడంతో ఆ మహిళా కానిస్టేబుల్ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళా కానిస్టేబుల్‌ రేవతిని హోం మంత్రి అనిత హత్తుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత ఒక కీలక విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితను ఒక సందర్భంలో హౌస్ అరెస్ట్ చేయాలని అధికారుల నుంచి ఎంవీపీ పోలీసులకు ఆదేశాలు అందాయి. దీంతో అప్పట్లో మహిళా కానిస్టేబుల్ గా ఉన్న రేవతి.. అనిత ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ హౌస్ అరెస్ట్ డ్యూటీలో ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన హోం మంత్రి ‘ పరిస్థితులు ఎలా ఉంటాయంటే.. ఆ రోజు ఈమె హౌస్ అరెస్ట్ కోసం వచ్చింది.. ఇప్పుడు నేను ఆమెను సీమంతం చేశాను..’ అని అన్నారు. దీంతో మహిళా కానిస్టేబుల్ రేవతి తో పాటు అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వకుండా ఉండలేకపోయారు. దానికి ‘ ఇలా మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడం నా అదృష్టంగా భావిస్తున్న’ అని హోం మంత్రి చెప్పిన మాటలకు నవ్వుతూ బదులిచ్చారు మహిళా కానిస్టేబుల్ రేవతి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #teacher #homeminister #anitha #constable #todaynews #flashnews #latestnews