Header Banner

పెన్షన్, రేషన్ అక్రమాలపై సర్కారు యాక్షన్..! అసెంబ్లీలో హాట్ డిబేట్!

  Thu Mar 06, 2025 20:26        Politics

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. అనర్హులుగా గుర్తించినవారికి పెన్షన్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 14 వేల మందికి పెన్షన్లు తొలగించామని, ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. పెన్షన్ల సర్వే క్రమబద్ధంగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్లు అందడం సరికాదని చెప్పారు. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 53.85 లక్షల మంది పెన్షన్లు పొందుతుండగా, ఈ సంఖ్య ప్రస్తుతం 63.59 లక్షలకు పెరిగిందని, ఇందులో అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ లబ్ధిదారుల వెరిఫికేషన్‌పై ఎమ్మెల్యేలు ప్రశ్నించగా, 2024 జూన్ నుంచి ఇప్పటివరకు 14,967 మందికి పెన్షన్లు తొలగించామని మంత్రి వివరించారు. వీరిలో 10,791 మంది శాశ్వత వలసదారులుగా, 4,176 మంది అనర్హులుగా గుర్తించామని తెలిపారు. మరోవైపు, రేషన్ బియ్యం అక్రమ మార్పిడిపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. కాకినాడ పోర్ట్ కేంద్రంగా విదేశాలకు బియ్యం తరలింపుతో పాటు, దొంగాట జరుగుతోందని నేతలు ఆరోపించారు. పెన్షన్లు, రేషన్ పంపిణీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టత ఇచ్చారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #PensionCuts #APGovernment #BreakingNews #WelfareReforms #PensionSurvey #GovernmentAction #APPolitics #RationScam #AssemblyDebate #PublicWelfare