Header Banner

క్రికెట్ నిబంధనల్లో అనూహ్య మార్పులు.. ఐసీసీ కీలక నిర్ణయం! ఈ మార్పులపై చర్చించే అవకాశం..

  Sat Apr 12, 2025 09:36        Sports

కాలానుగుణంగా క్రికెట్‌లో మార్పులకు శ్రీకారం చుడుతున్న ఐసీసీ.. వన్డే, టీ20తోపాటు టెస్ట్ ఫార్మాట్‌లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న భేటీలో జైషా నేతృత్వంలోని ఐసీసీ ఈ మార్పులపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వన్డేల్లో రెండు బంతుల నియమాన్ని రద్దు చేయడం, టీ20ల్లోనూ అండర్-19 ప్రపంచకప్ ప్రవేశపెట్టడం, టెస్టుల్లో ఓవర్ రేటును లెక్కించేందుకు టైమర్‌ను ప్రవేశపెట్టడం వంటి మార్పులు చేయాలని ఐసీసీ యోచిస్తోంది. ఏప్రిల్ 10న ప్రారంభమైన ఈ భేటీ రేపటి (13వ తేదీ) వరకు కొనసాగనుంది. అనంతరం ఈ మూడు అంశాలపై ఐసీసీ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. వన్డేల్లో ప్రస్తుతం రెండు బంతుల విధానం కొనసాగుతోంది. బౌలింగ్ కోసం ప్రతి జట్టు కొత్త బంతిని ఉపయోగిస్తుంది. కొత్త బంతి మెరుస్తుండటం వల్ల పేసర్లు స్వింగ్‌ను రాబట్టలేకపోతున్నారు. అలాగే, 25 ఓవర్ల తర్వాత మళ్లీ కొత్త బంతిని తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా బ్యాటర్లు అదనపు లబ్ధి పొందుతున్నారన్న విమర్శలున్నాయి.

 

ఇది కూడా చదవండి: మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

ఈ నేపథ్యంలో బౌలర్లకు కూడా అనుకూలంగా ఉండేలా ఈ రెండు బంతుల నిబంధనను రద్దు చేయాలని ఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. టెస్టుల్లోనూ టైమర్‌ను ప్రవేశపెట్టాలన్నది ఐసీసీ యోచన. స్లో ఓవర్ రేటు కారణంగా ఐపీఎల్‌లో పలువురు కెప్టెన్లు భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల బీసీసీఐకి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. ఇకపై ఇదే పద్ధతిని టెస్టుల్లోనూ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఓవర్ పూర్తయిన నిమిషంలోనే మరో ఓవర్ తొలి బంతి పడాల్సి ఉంటుంది. టెస్టుల్లో ఒక రోజు 90 ఓవర్లు వేయాలి. దీనిని పక్కాగా అమలు చేసేందుకు టైమర్ నిర్ణయమే సరైనదన్న అభిప్రాయం ఉంది. ఇక మూడోది అండర్-19 టీ20 ప్రపంచకప్. ప్రస్తుతం టీ20లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వన్డేల్లానే అండర్-19 ప్రపంచకప్ ప్రవేశపెట్టాలని ఐసీసీ యోచిస్తోంది. ఇప్పటి వరకు రెండుసార్లు అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ జరిగింది. ఈ నేపథ్యంలో పురుషుల విభాగంలోనూ అండర్-19 ప్రపంచకప్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తోంది. 

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia