Header Banner

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే.!

  Fri Apr 18, 2025 11:09        Environment

ఒక‌వైపు ఎండలు దంచి కొడుతుంటే.. మ‌రోవైపు అక్క‌డ‌క్క‌డా వాన‌లు ప‌డుతుండటం వేస‌వి తాపంలో జ‌నాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. ఈ క్ర‌మంలో ఈరోజు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ మ‌రోసారి చల్ల‌ని క‌బురు చెప్పింది. ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని, అలాగే కొన్ని జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. నేడు తెలంగాణ‌లోని సూర్యాపేట, మ‌హ‌బూబాబాద్‌, ఖ‌మ్మం, జ‌న‌గాం, సిద్దిపేట‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, న‌ల్గొండ‌, క‌రీంన‌గ‌ర్‌, జగిత్యాల‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, కొమురంభీమ్ జిల్లాల్లో అక్క‌డ‌క్కడా ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన‌కాప‌ల్లి, అన్న‌మ‌య్య, పార్వ‌తిపురం మ‌న్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోన‌సీమ‌, శ్రీస‌త్య‌సాయి, ఏలూరు, తూర్పుగోదావ‌రి, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగుల‌తో కూడిన తేలిక‌పాటి వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఏపీ రాష్ట్ర విప‌త్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కూడా తీర ప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు ఉండ‌వచ్చ‌ని, మ‌త్స్య‌కారులు వేట కోసం స‌ముద్రంలోకి వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించింది.  

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather #CycloneDana