Header Banner

ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు ఇక వాట్సప్‌లో! ప్రైవేట్ కాలేజీల వేధింపులకు చెక్! డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  Fri Feb 07, 2025 11:20        Education

ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సప్‌ ద్వారా నేటి నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్‌టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా వారంతా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. త్వరలో పదో తరగతి విద్యార్థులకూ ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది.
ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలి అంటే: ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్​కి హాయ్ (Hi) అనే వాట్సప్​లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి. అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్​లోడ్​పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్​ డౌన్​లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్​లోనే ఎంతో సింపుల్​గా డౌన్​లోడ్ అవుతుంది.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!



పరీక్షల షెడ్యూల్: ఏపీలో ఇంటర్మీడిట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్:
మార్చి 1వ తేదీన సెకండ్ లాంగ్వేజీ పేపర్ -1
మార్చి 4వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -1
మార్చి 6వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -1A, బోటానీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
మార్చి 8వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మార్చి 11వ తేదీన ఫిజిక్స్ పేపర్-1, ఎకానమిక్స్ పేపర్-1
మార్చి 13వ తేదీన కెమిస్ట్రీ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, కామర్స్ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
మార్చి 17వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్1, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -1 (బైపీసీ విద్యార్థులకు)
మార్చి 19వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్:
మార్చి 3వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మార్చి 5వ తేదీన ఇంగ్లీష్ పేపర్ -2
మార్చి 7వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -2A, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2
మార్చి 10వ తేదీన మేథమెటిక్స్ పేపర్ -2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చి 12వ తేదీన ఫిజిక్స్ పేపర్-2, ఎకానమిక్స్ పేపర్-2
మార్చి 15వ తేదీన కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్2
మార్చి 18వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్2, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -2(బైపీసీ విద్యార్థులకు) మార్చి 20వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

 

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

 

జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #inter #halltickets #whatsapp #download #todaynews #flashnews