Header Banner

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూత!

  Sun Apr 06, 2025 20:41        Entertainment

ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. కిమ్ మృతితో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కిమ్ గతంలో బహ్రెయిన్‌లోని మనామాలో నివసించేవారు. 2022లో కూడా ఆమె ఇలాంటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో బహ్రెయిన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆమెను ముంబయికి తీసుకువచ్చారు.

 

ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం! అంతర్జాతీయ రాజధానిగా అమరావతి .. మీటింగ్‌లో సంచలన నిర్ణయాలు!

 

మార్చి 24న కిమ్ ఫెర్నాండెజ్‌కు గుండెపోటు రావడంతో ఆమెను ముంబయి లీలావతి ఆసుపత్రిలో ఐసీయూలో చేర్చారు. అయితే ఇవాళ తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు విడిచారు. కాగా, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆసుపత్రికి వెళ్లి జాక్వెలిన్ ను పరామర్శించారు. మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జాక్వెలిన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, తల్లికి అనారోగ్యం కారణంగా ఆమె ఆ ప్రదర్శనను రద్దు చేసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జాక్వెలిన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JacquelineFernandez #KimFernandez #Mother'sDeath #BollywoodActress