Header Banner

కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్! కారణం ఏంటో తెలుసా?

  Wed Apr 23, 2025 07:45        Politics

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.పార్టీ క్రమ శిక్షణను ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుతో అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో...వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ఓ ప్రకటనంలో తెలిపింది.
ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, ముఖ్యంగా దివ్వెల మాధురితో సంబంధం, కుటుంబ సమస్యలతో పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఈ వివాదాల నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన వల్ల పార్టీకి ఇబ్బంది పడుతుందని, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని తానే స్వయంగా కోరినట్టు దువ్వాడ శ్రీనివాస్‌ వెల్లడించారు.


ఇది కూడా చదవండి: ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య.. కత్తులతో దాడి చేసిన దుండగులు!


ఇక ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్‌ ఫ్యామిలీ స్టోరీ ఓ సంచలనమే అని చెప్పాలి. సాధారణంగా అందరి రాజకీయ నాయకులకు శత్రువులు ఉంటారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌‌కు మాత్రం శత్రువులు ఎక్కడో లేరు ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్‌‌కు పోటీగా ఆయన భార్య దువ్వాడ వాణి గత ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో జగన్ కలుగజేసుకోవడంతో దువ్వాడ వాణి పోటీ నుంచి విరమించుకున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ కథ చిత్రం మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణిని కాదని ,దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్‌ భార్య , కూతుర్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. . ఈ క్రమంలో వారు టెక్కలిలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతుళ్లు, తండ్రితో కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్‌ సహజీవనం వ్యవహారం కోర్టులో నడుస్తోంది.ఇటువంటి సమయంలోనే జగన్ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YSRCP #JaganDecision #PoliticalShock #SuspensionNews #AndhraPolitics #KeyLeaderOut