Header Banner

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

  Mon Apr 21, 2025 08:50        Politics, U S A

భారత్‌ పర్యటనకు ముందు వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్. ఈ భేటీలో యుద్ధం, సంక్షోభాలు, వలసదారులు, శరణార్థులు గురించి చర్చించారు. అలాగే పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఐతే వలసల విషయంలో ట్రంప్‌ను విభేదించిన పోప్‌తో వాన్స్‌ భేటీకావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన సతీమణి ఉషా తో కలిసి భారత్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు భారత్‌లో వాన్స్‌ దంపతుల పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. నేడు ప్రధాని మోదీతో జేడీ వాన్స్‌ సమావేశంకానున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక సంబంధాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికా టారీఫ్‌లపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి జేడీ వాన్స్‌ దంపతులకు మోదీ విందు ఇవ్వనున్నారు.

 

ఇది కూడా చదవండి: సౌదీ అరేబియాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సంబరాలు.. తెలుగు జాతి గుండె గుడిలో..

 

ఈ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వాన్స్ ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మరోవైపు అచ్చ తెలుగమ్మాయి.. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ సతీమణి ఉషకు అరుదైన కానుకని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఉషావాన్స్‌కు మెమెంటో ఇవ్వనునుంది కేంద్ర రైల్వేశాఖ. ఈ మెమెంటోను ఉషావాన్స్ కు స్వయంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బహూకరించనున్నారు. ఉషావాన్స్ కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా సాయిపురంలో ఉన్నాయి. 1970లో ఉషావాన్స్ తల్లిదండ్రులు అగ్రరాజ్యం అమెరికాకు వలసవెళ్ళారు. మరోవైపు కుటుంబసమేతంగా ఇండియా వస్తున్న వాన్స్‌ దంపతులు ఏపీకి రావాలంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు ప్రజలు. ఉషా వాన్స్.. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. దీంతో పూర్వీకులు నివసించిన వడ్లూరును సందర్శిస్తారని ఆశిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. 80ఏళ్ల క్రితం గ్రామ అభివృద్ధిలో ఉషా వాన్స్ కుటుంబం కీలక పాత్ర పోషించిందని.. చాలా మందికి విద్య అవకాశాలను కల్పించిందని చెబుతున్నారు గ్రామస్తులు. ఎలాగైనా జేడి వాన్స్ కుటుంబం వడ్లూరు సందర్శించేల చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations