Header Banner

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!

  Tue Mar 11, 2025 19:41        Education

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ 2025 తుది విడత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జేఈఈ మెయిన్‌ సెషన్ 2 షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌1 పరీక్ష జరుగుతుంది. ఇక ఏప్రిల్‌ 9వ తేదీన బీఆర్క్‌/బీ ప్లానింగ్‌ పేపర్‌ 2ఏ, 2బీ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి. కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు యేటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పరీక్షలు జనవరి 22వ తేదీన ప్రారంభమై మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పేపర్‌ 1 పరీక్షలు జరిగాయి. తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడయ్యాయి.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


తాజాగా రెండో సెషన్‌ పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌ 1 పరీక్ష ఏప్రిల్‌ 2,3,4,7 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 8వ తేదీన పరీక్ష మొదటి షిఫ్టులో మాత్రమే జరగనుంది. అలాగే ఏప్రిల్‌ 9న పేపర్‌ 2ఏ (బీఆర్క్‌), పేపర్‌-2బి (బిప్లానింగ్‌, పేపర్‌ 2ఎ, బి (బీఆర్క్‌, బి ప్లానింగ్‌) పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలతో పాటు విదేశాల్లోరూ 15 నగరాల్లో ఈ జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తికాగా.. త్వరలోనే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేయనున్నారు. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jeemain #exam #schedule #release #todaynews #flashnews #latestnews