Header Banner

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

  Tue Apr 01, 2025 11:01        Politics

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. క్వార్ట్జ్ అక్రమ క్వారీయింగ్‌పై ఆయనపై నమోదైన కేసులో ఈ రోజు (ఏప్రిల్ 1) నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. నిన్న (మార్చి 31న) విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పారిపోయారంటూ ప్రచారం జరగగా, తాను హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకొంటున్నట్లు తెలిపేలా కాకాణి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు నిన్న హైదరాబాద్ వెళ్లారు.

 

ఇది కూడా చదవండి: రూటు మార్చిన ట్రంప్.. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్! అరుదైన ఖనిజాల ఒప్పందం..

        

కమలాపురి కాలనీలోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా, ఆయన అక్కడ లేరు. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదని సమాచారం. దీంతో ఆయన కుమారుడు సుమంత్‌కు పోలీసులు రెండో నోటీసు అందించారు. మంగళవారం (ఈరోజు) నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే, ఈ రోజు కాకాణి విచారణకు హాజరుకాకపోతే చట్టపరంగా ముందుకు వెళతామని పోలీసులు అంటున్నారు. మరోపక్క ఏపీ హైకోర్టులో కాకాణి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. అలానే తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కాకాణి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కూడా ఈ రోజు ఉన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కాకాణి పోలీసు విచారణకు హాజరవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

 

ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #YCP #Jagan #AndhraPradesh #APpolitics #APNews #EC #JaganPolitics