Header Banner

ఉచిత గ్యాస్ సిలిండర్‌పై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! ఆ డేట్‌లోగా బుక్ తప్పనిసరి?

  Wed Feb 05, 2025 07:00        Politics

కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి కానుకగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది మొదటి విడత గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నారు. అయితే కొంత మంది ఇంకా తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. 

 

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించి తీరుతామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నాసరే పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 

 

ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పథకం ప్రారంభించిన మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా.. ఇంకా చాలా మంది మహిళలు తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. వీరంతా మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం ఉచితంగా అందించే మొదటి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. లేదంటే మార్చి 31వ తేదీ తర్వత గ్యాస్ బుక్ చేసుకుంటే అది రెండో విడత గ్యాస్ సిలిండర్ కిందకి వస్తుంది. దీంతో లబ్ధిదారులు తొలి విడత గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు అవుతుంది. ఫలితంగా వారికి ఏడాదిలో రెండు ఉచిత సిలిండర్లు మాత్రమే అందుతాయి. 

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్‌ కనెక్షన్‌కు ఒకటి చొప్పున సిలిండర్లను ఉచితంగా ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నారు. 

 

ప్రధాని ఉజ్వల యోజన పథకంలో మార్పులు చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా డెలివరీ అయిన వెంటనే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అర్హులైన లబ్దిదారు మహిళలు మార్చి నెల చివరి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP